Saturday, October 25, 2025
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి

సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
అమృత్ 2.0 కు సిరిసిల్ల మున్సిపాలిటీ ఎంపిక
వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
అమృత్ 2.O పథకం కింద సిరిసిల్ల మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అమలుకు మొదటి కన్సల్టేటివ్ వర్క్ షాప్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. జీఐఎస్ సాంకేతికత ఆధారంగా బేస్ మ్యాప్స్, ల్యాండ్ యూజ్ మ్యాప్స్, మాస్టర్ ప్లాన్‌లు, అర్బన్ జియో-పోర్టల్ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే పూర్తిచేయడంతో పాటు, సోషియో ఎకమిక్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.

వివిధ జిల్లా శాఖ అధికారులు సంబంధిత వివరాలు మొత్తం అందజేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఆయా శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు చేసిన ప్రణాళికల వివరాలు అందించాలన్నారు. మాస్టర్ ప్లాన్ అమలుతో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, త్రాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు మెరుగుపడతాయని వివరించారు.
వారం రోజుల్లోగా వివిధశాఖల జిల్లా అధికారులు సంబంధిత డేటా, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల వివరాలు అందజేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలులో సంబంధిత అధికారులం దరూ భాగస్వామ్యం అవ్వాలని పేర్కొన్నారు.
సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జీ ఐ ఎస్ హబ్ డీటీసీపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్వినీ యాదవ్, డీ టీ సీ పీ వో వరంగల్ ఏడీ జ్యోతి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీటీసీపీవో అన్సారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -