రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత..
సర్వే కోసం రూ. 30 వేలు డిమాండ్..
అవినీతిపై ఫిర్యాదు చేసిన బాధితుడు..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మూడు ఎకరాల భూమి సర్వే కోసం ఓ సర్వేయర్ రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల్ల ప్రవీణ్ కు సిరిసిల్ల మున్సిపల్ అర్బన్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాలలో 123 సర్వే నెంబర్ లో 3.32 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా ఆయన సిరిసిల్ల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
గత ఐదు నెలలుగా సిరిసిల్ల రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న వేణుగోపాల్ అనే సర్వేయర్ చుట్టూ కూడా తిరిగాడు. కాగా ఇటీవల ప్రవీణ్ భూమి సర్వే చేయడానికి సర్వేయర్ వేణు రూ. 50 వేలు డిమాండ్ చేయగా 30 వేలకు కుదిరింది. అయితే ప్రవీణ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. మొదటగా సర్వే చేసిన రోజు రూ. 10వేల లంచం తీసుకొని, సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రూ.20 వేలు తన ప్రైవేట్ అసిస్టెంట్ సూర్య వంశీ తీసుకుంటుండగా, సిరిసిల్ల ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ వేణుగోపాల్ తో పాటు తన ప్రయివేట్ అసిస్టెంట్ సూర్యవంశీ ఇద్దరినీ బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు. కాగా ఈ సర్వేయర్ వేణుపై ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ వలలో సిరిసిల్ల సర్వేయర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES