Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌ఐ సర్వీస్‌ రివాల్వర్‌ మిస్సింగ్‌ !

ఎస్‌ఐ సర్వీస్‌ రివాల్వర్‌ మిస్సింగ్‌ !

- Advertisement -

– ఆర్థిక ఇబ్బందులతో తాకట్టు పెట్టాడని అనుమానాలు
– రికవరీ బంగారం కూడా..
– అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
నవతెలంగాణ-అంబర్‌పేట

రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టడంతోపాటు తన సర్వీస్‌ రివాల్వర్‌ను పోగొట్టుకున్న హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఐ ఉదంతం పోలీస్‌ శాఖలో కలకలం రేపింది. బెట్టింగ్‌ యాప్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతోనే ఎస్‌ఐ రికవరీ బంగారాన్ని తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. దీన్ని అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసి.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2020 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐ భాను ప్రకాష్‌ గతంలో హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేశారు. ఏడాదిన్నర కిందట అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చిన ఆయన ముందు డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డీడీ కాలనీ సెక్టార్‌ ఎస్‌ఐగా పని చేస్తున్నారు. అయితే క్రైం ఎస్‌ఐగా పని చేసిన సమయంలో ఓ చోరీ కేసులో రికవరీ చేసిన నాలుగున్నర తులాల బంగారాన్ని ఆయన పాన్‌ బ్రోకర్‌ వద్ద తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బును సొంత అవసరాలకు వాడుకుని, ఆ కేసును కూడా క్లోజ్‌ చేశాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారుడు తన రికవరీ సొత్తును ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో అతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో విషయం బయటకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు ఎస్‌ఐ భానుప్రకాష్‌కు పోలీస్‌ శాఖ కేటాయించిన 9 ఎంఎం సర్వీస్‌ రివాల్వర్‌ కూడా పోయినట్టు తెలిసింది. రివాల్వర్‌ విషయంపై ఉన్నతాధికారులు ఎస్‌ఐని ఎంత అడిగినా పెదవి విప్పడం లేదని సమాచారం. దీంతో ఈనెల 22న ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. సర్వీస్‌ రివాల్వర్‌ ఎక్కడికి పోయిందనే విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని భానును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -