Tuesday, October 14, 2025
E-PAPER
Homeజిల్లాలుకొర్రెములలో రెండో రోజు ‘సీతాఫల్‌మండి’ విద్యార్థుల శ్ర‌మ‌దానం

కొర్రెములలో రెండో రోజు ‘సీతాఫల్‌మండి’ విద్యార్థుల శ్ర‌మ‌దానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఘట్‌కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామంలో రెండో రోజు సీతాఫల్‌మండి ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల NSS-1 విద్యార్థులు శ్ర‌మ‌దానం నిర్వ‌హించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ బి. వెంకటేశం నాయకత్వంలో మంగ‌ళ‌వారం స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఆ గ్రామంలోని ప‌లు ప్ర‌దేశాల‌ను శుభ్రం చేశారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో NSS వాలంటీర్లు, నవీన్ కుమార్, దీపక్, ఖలీల్, మహాలక్ష్మి, అరుణ, సౌజన్య, పూజ, భార్గవి, సందీప్ భువనేశ్వరి, స్నేహ, సంధ్య, దివ్య, కళాశాల సిబ్బంది డా. కిషోర్, శ్రావ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -