- Advertisement -
కాంగ్రెస్ నాయకుల పరామర్శ ..
నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్ తల్లి బానోత్ నాగమ్మ (80) వృద్ధాప్యంతో ఇటీవల మృతి చెందారు. సీతారాం కుటుంబ సభ్యులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో శనివారం నాయకులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల నాయకులు రంగు మురళి గౌడ్, పొడిశెట్టి సైదులు గౌడ్, బానోత్ గోపాల్ నాయక్, దాసరి శ్రీనివాస్, ముత్తినేని శ్రీనివాస్, దుంపల శ్యాం, గ్రామ పార్టీ అధ్యక్షుడు యాకయ్య, మహేష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -