Thursday, December 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవియత్నాంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

వియత్నాంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వియత్నాంలోని ఖాన్ లే పాస్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణీకుల బస్సు నేలమట్టమైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. హో చి మిన్ సిటీ నుండి డా లాట్ మీదుగా న్హా ట్రాంగ్ వెళ్తున్న బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వియత్నాంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -