Tuesday, November 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు..

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యులు ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, ఆకునూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ ఇంట్లో రోజూ వారీలా గ్యాస్ పొయ్యి వెలిగించే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో పెద్ద శబ్దం సంభవించింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న భాస్కర్‌తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య ముగ్గురు పిల్లలు ప్రణవి, కృతిక, హర్షిణిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -