Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కొనుగోలుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి

యూరియా కొనుగోలుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
పంటలకు యూరియా అవసరమైన ప్రతి రైతు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను స్లాట్ బుక్ చేసుకోవాలని కొంపల్లి ఏఈఓ యాదగిరి రైతులకు సూచించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ ప్రారంభించిన సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలోని శ్రీనివాస ట్రేడర్స్ నందు ఏఈఓ యాదగిరి రైతులకు అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క రైతు యాప్ ద్వారా మాత్రమే యూరియాను స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు చూసుకోవాలి కానీ యూరియాను పాత పద్ధతిలో  అమ్మబడదని తెలిపారు. 

స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల లోపు యూరియాను తీసుకెళ్లడానికి వీలవుతుంది. ప్రతి ఒక్క రైతుకి తమకు ఉన్న భూమి ప్రకారం, వేసిన పంటకు అనుగుణంగా యూరియాను కేటాయించడం జరుగుతుందని కావున రైతులందరూ తమ యొక్క పంటలను ఏఈఓ వద్ద నమోదు చేయించుకొని అవసరమున్న మేరకు మాత్రమే యూరియాని యాప్ ద్వారా బుక్ చేసుకుని తీసుకెళ్లాలని సూచించారు. మండలానికి సరిపోయేంత యూరియా అందుబాటులో ఉంది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో శ్రీనివాస ట్రేడర్స్ యజమాని శ్రీకాంత్ మరియు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -