భారత్‌పై ఇన్వెస్టర్ల అనాసక్తి
నికర ఎఫ్‌డీఐల్లో పతనం
ఐదో మాసంలోనూ ప్రతికూలత
ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షణీయంగా ఉందని.. విదేశీ పెట్టుబడిదారులు విశేష ఆసక్తి కనబర్చుతున్నారని బీజేపీ ప్రభుత్వ వర్గాలు చేస్తోన్న ప్రచారాని కి వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొత్త పెట్టుబ డుల రాక పడిపోగా.. మరోవైపు ఉన్న విదేశీ పెట్టుబడులు తరలిపో వడం ఆందోళక రం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థలోకి కొత్త పెట్టుబడుల రాక మందగించింది. ఉన్న పెట్టుబడులు కూడా వేగంగా వెనక్కి తరలిపోతున్నాయి. దీంతో వరుసగా ఐదో నెల 2026 జనవరిలోనూ నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతికూ లంగా నమోదుకావడం ఆందోళకర ం. భారత్‌లోకి వచ్చిన పెట్టుబడుల కంటే.. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులే ఏకంగా 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13వేల కోట్లు) ఎక్కువగా ఉండటం గమనార్హం. జనవరి 2026లో భారతీయ కంపెనీలు విదేశాల్లో చేసే పెట్టుబడులు 5.4 శాతం పెరిగి 2.1 బిలియన్ డాలర్ల కు చేరాయి. అత్యధికంగా అమెరి కా, సింగపూర్, బ్రిటన్, యూఏఈ లకు భారత పెట్టుబడులు తరలిపో యాయి. మరోవైపు భారత్‌లో వ్యాపారం చేస్తున్న విదేశీ కంపెనీ లు తమ నిధులను వెనక్కి తీసుకోవ డం లేదా పెట్టుబడుల ఉపసంహర ణ ఏకంగా 97.3 శాతం పెరిగి 4.9 బిలియన్లకు చేరింది. ఫలితంగా నికర ఎఫ్‌డీఐ మైనస్ 1.4 బిలియన్లుగా నమోదయ్యింది. ఇది అక్టోబర్ 2025 తర్వాత అత్యంత తక్కువ స్థాయి. కొత్తగా వస్తున్న ప్రతి రూపాయి కంటే వెనక్కి వెళ్తున్న నిధులు దాదాపు రెట్టింపుగా ఉన్నాయని స్పష్టమవు తోంది. గత ఏడాది జనవరితో పోలిస్తే కొత్తగా వచ్చే స్థూల ఎఫ్‌డిఐల రాకలోనూ 7 శాతం క్షీణించి 5.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇది అంతర్జా తీయ ఇన్వెస్టర్లలో భారత మార్కె ట్‌పై అనాసక్తిని స్పష్టం చేస్తోంది.
సురక్షిత మార్కెట్లకు తరలింపు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితు ల వల్ల పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటమే కాకుండా తమ నిధులను సురక్షితమైన మార్కెట్లకు తరలిస్తున్నారు. దీనివల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కూడా మార్చిలో నికర విక్రయదారు లుగా మారిపోయారని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ సర్వీసెస్, విద్యుత్, ఇతర ఇంధన రంగాలు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటివి మొత్తం పెట్టుబడులలో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. తయారీ, కంప్యూటర్ సేవల రంగాలు కొంతవరకు పెట్టుబడులను ఆకర్షిస్తు న్నప్పటికీ, పెట్టుబడుల ఉపసంహరణ వేగం పెరగడం భారత రూపాయి విలువపై, విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.



