Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఎమ్మెల్యేపై బస్తీవాసుల ఆగ్రహం

ఎమ్మెల్యేపై బస్తీవాసుల ఆగ్రహం

- Advertisement -

– నాలా పనులపై నిలదీత
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ యాకత్‌పుర ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌తోపాటు అతని అనుచరులపై బస్తీవాసులు తిరగబడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… మౌలాకా చిల్లా ప్రాంతంలో నాలా పనులు పెండింగ్‌లో ఉండటంతో తమ ఇండ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా గురువారం మౌలాకాచిల్లా ప్రాంతంలో నాలా పనులను ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ పరిశీలించారు. ఆ సమయంలో నాలా పనులపై ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. వర్షాకాలం వచ్చినా నాలా పనులు పూర్తి చేయించలేని, ఎమ్మెల్యే ఉండి ఎందుకని ప్రశ్నించారు. దాంతో ఎమ్మెల్యేనే ఎదురిస్తారా అంటూ అనుచరులు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులపై స్థానికులు తిరగబడ్డారు. తోపులాట జరిగింది. తమ సమస్యలపై ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే, అనుచరులతో దాడి చేయిస్తారా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తిరుగుబాటుతో ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, అతని అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad