Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలుచిన్న పత్రికలంటే చిన్న చూపేందుకు.?

చిన్న పత్రికలంటే చిన్న చూపేందుకు.?

- Advertisement -

– ఆవేదన వ్యక్తం చేసిన మాజీ జర్నలిస్ట్ కంకణాల రాజేశ్వర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
చిన్న పత్రికలు అంటే చిన్న చూపేందుకని  మాజీ జర్నలిస్ట్ కంకణాల రాజేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమాల సమాచారాన్ని దాదాపు అన్ని పత్రికలకు అందజేసేట్లు అధికారులు వ్యవహరించాలని, కొన్ని తమకు అనుకూలమైన పత్రికల వారికే సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. వార్తలో దమ్ముండాలే కానీ, అది ఏ పత్రిక అనేది అవసరం లేదన్నారు.

చిన్న పత్రికల్లో, ఈ- పేపర్లలో వచ్చిన వార్తలు కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్క్రాప్ బుక్ లో పొందుపరిచేలా అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పత్రికలకు సర్కులేషన్ మాత్రమే ముఖ్యం కాదని, అధికార పార్టీకి అనుకూలంగా రాస్తేనే అది వార్త కాదన్నారు. వార్త వార్త లాగే ఉండాలని, పత్రిక ప్రమాణాలే వార్తలకు శ్వాస అని, జర్నలిస్ట్ లను గౌరవించాలని కోరారు. జర్నలిస్టులు కూడా గౌరవింపబడేట్లు వ్యవహరించాలని పేర్కొన్నారు. ఒక వార్త కొరకై కార్యాలయానికి వచ్చి సేకరించుకొని వెళ్లిన తర్వాత అట్టి జర్నలిస్ట్ పై నెగటివ్ గా మాట్లాడే అధికారులు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కోకొల్లలుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాంటి అధికారుల తీరు మారాలన్నారు. చిన్న పత్రికల జర్నలిస్టులను చిన్న చూపుతో చూడొద్దని అధికారులను కోరారు. జర్నలిస్టుల భావజాల శక్తి యుక్తుల్ని బేరీజు వేసుకోవాలన్నారు.

ఈ-పేపర్లను కూడా గౌరవించి ఆదరించాలని, చిన్న పత్రికలన్నా, ఈ- పేపర్లన్నా కొన్ని కార్యాలయాలలో అధికారులు చులకన భావంతో చూస్తున్నారని ఇది సరైంది కాదన్నారు. జిల్లాస్థాయిలో అధికారికంగా జరిగే కార్యక్రమాలు చూసే జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) పక్షపాత ధోరణితో చూడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రకటనలో కోరారు. అలా కాకుండా రాష్ట్రంలో తగిన సమాచారం ఇవ్వని డిపిఆర్ఓ లు అక్కడక్కడా కొందరు ఉన్నారు. చులకన భావంతో చూసే అధికారులు చాలామంది ఉన్నారని,అట్లాంటి వారి తీరు మారాలన్నారు. ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలతో మెదులుకోవాలని అధికారులను కోరారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల అధికారులు, కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు చిన్న పత్రికల జర్నలిస్టులకు, ఈ-పేపర్ ల జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకటనలు  అన్ని పత్రికలకు, ఈ- పేపర్లకు కూడా ఇచ్చినట్లయితే సహకరించిన వారవుతారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -