- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండోర్ మద్యప్రదేశ్‌లో పుష్ప సినిమాను తలపించేలా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ట్రక్కు కింద అచ్చం ఫ్యూయల్ ట్యాంకులా కనిపించే ఫేక్ డీజిల్ ట్యాంక్‌ను స్మగ్లర్ తయారు చేయించాడు. పోలీసులు దాన్ని ఓపెన్ చేయగా రూ.25 లక్షల విలువైన 87 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితుడు బుట్టా సింగ్‌ను అరెస్ట్ చేసి ఈ ఇంటర్‌స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్ వెనక ఉన్న గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.
- Advertisement -



