Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎగిసిన చమురు ధరలు

ఎగిసిన చమురు ధరలు

- Advertisement -

– ఇరాన్‌- ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతల ప్రభావం
ముంబయి:
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ యుద్ధ దాడులు చమురు ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఎగిసిపడ్డాయి. ముడి చమురు బ్యారెల్‌ ధర ఓ దశలో 13 శాతం పెరిగింది. తుదకు 7 శాతం పెరిగి 75 డాలర్లుగా నమోదయ్యింది. ఇరాన్‌- ఇజ్రాయిల్‌ భౌగోళిక దాడులతో హర్మోజ్‌ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్‌ చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చనే ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరగడంతో పాటుగా ఆ రంగం కంపెనీల షేర్లు నష్టాలను చవి చూశాయి. బీపీసీఎల్‌ షేరు 5.75 శాతం నష్టంతో 312.90 వద్ద ముగిసింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్‌ 1.67 శాతం కోల్పోయి రూ.140.60 వద్ద నమోదయ్యింది. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ షేర్‌ 1.60 శాతం నష్టంతో రూ.386.25 వద్ద ముగిసింది. ఒమన్‌-ఇరాన్‌ సముద్రమార్గంలో హర్మోజ్‌ జలసంధి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో 21శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad