Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక చైతన్య చిత్రాలు రావాలి

సామాజిక చైతన్య చిత్రాలు రావాలి

- Advertisement -

– గద్దర్‌ సినిమా అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావుకు
– ఆత్మీయ అభినందన సభ
నవతెలంగాణ-హైదరాబాద్‌

విద్యారంగ ప్రగతికి కషిచేసే ‘చదువుకోవాలి’ సినిమాను నిర్మించి, గద్దర్‌ అవార్డు పొంది అందరికీ ఆదర్శంగా దర్శక, నిర్మాత, రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎం.వెంకటేశ్వరరావు నిలిచారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ జి.చిన్నారెడ్డి అన్నారు. హరిహర ఫౌండేషన్‌, తెలంగాణా భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో గద్దర్‌ అవార్డు గ్రహీత ఎం.వెంకటేశ్వరరావు సోమవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందనసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మంచి చిత్రాలు రావాలనీ, సామాజిక అంశాలపై చిత్రాలు తీయాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డ్రగ్స్‌, మద్యపాన వినియోగం పెరిగి పోయిందనీ, వీటి నివారణకు సినిమాలు రూపొందించాలని కోరారు. వనపర్తి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు తెలంగాణా నుంచి విద్యకోసం ఒక మంచి చిత్రం రూపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందు కోవడం విశేషమన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ‘చదువుకోవాలి’ లాంటి ఉత్తమ చిత్రానికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి గద్దర్‌ అవార్డును ప్రత్యేకంగా ఇచ్చి ప్రోత్సహించడం గొప్ప విషయ మన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మామిడి హరికష్ణ, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్‌, పీసీసీ రాష్ట్ర నాయకులు రమ్యారావు, ఒమేగా విద్యా సంస్థల అధిపతి ఎన్‌.నాగమోహనరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్‌ రావును అభినందించారు. నాగమోహన ్‌రెడ్డి ఈ చిత్రానికి రూ. 50 వేల సహాయాన్ని అందించారు. జెఎన్టీయూ మాజీ వీసీ డిఎన్‌ రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మెన్‌, ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్‌ ఉత్తమ చిత్రం తీసిన వెంకటేశ్వరరావును అభినంది ంచారు.హరిహర ఫౌండేషన్‌ అధ్యక్షులు మారగాని శ్రీనివాసరావు, రాష్ట్ర ఫార్మసీ కళాశాలల సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ కె.రామదాస్‌ తదితరులు పాల్గొన్నారు. చిత్ర దర్శకులు వెంకటేశ్వ రావుతోపాటు నటి దేశరాజు లలిత, సహ నిర్మాత పవన్‌సాయి, కో డైరెక్టర్‌ సాయిశ్వేతను సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -