Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాగర్‌కర్నూల్‌కు 'సామాజిక చైతన్య రథయాత్ర'

నాగర్‌కర్నూల్‌కు ‘సామాజిక చైతన్య రథయాత్ర’

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవై దిలీప్‌కుమార్‌ ‘సామాజిక చైతన్య రథయాత్ర’ శనివారం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది, రెండో దశ ఉద్యమంలో 1200 మంది చేసిన ఆత్మబలి దానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక తెలంగాణగానే మిగిలిపోవడం, బహుజనులకు అధికార పగ్గాలు అందకపోవడం బాధాకరం’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఉన్న రూ. 6 వేల కోట్ల బకాయిలను, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని కోరారు. అంతకుముందు నిర్వహించిన బుల్లెట్‌ వెంకన్న కళా బృందం ప్రదర్శనలు నగర ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు టీఆర్‌ఎల్డీ రాష్ట్ర నాయకులు మల్లేష్‌ యుద్ధం, రిషట్‌ జైన్‌, జాని, నరసింహరావు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -