Thursday, December 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం16ఏండ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

16ఏండ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

- Advertisement -

ప్రపంచంలోనే తొలి దేశంగా ఆస్ట్రేలియా

సిడ్నీ : పదహారేండ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియాను నిషేధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. టిక్‌టాక్‌, యూ ట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమ వేదికలేవీ కూడా పిల్లలకు అందుబాటులో లేకుండా చేసింది. మొత్తంగా పది సోషల్‌ మీడియా వేదికలపై నిషేధం మంగళ వారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం కింద వచ్చిన ఈ నిషేధాన్ని ఉల్లంఘించినవారు 33 మిలియన్ల డాలర్లు వరకు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. కాగా, దీనిపై ప్రధాన టెక్నాలజీ కంపెనీలు, భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్ధించే హక్కుల గ్రూపులు తీవ్రంగా విమర్శలు చేశాయి. కాగా పిల్లల తల్లిదండ్రులు, బాలల హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. కుటుంబాలకు ఇదొక గర్వకారణమైన రోజని ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ వ్యాఖ్యానించారు.

సాంప్రదాయ పరిరక్షణలను దాటి జరుగుతున్న ఆన్‌లైన్‌ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కొత్త సాంకేతికత ఎప్పుడూ అద్భుతమైన విషయాలను అందిస్తుంది, కానీ మన గమ్యం ఏమిటో మానవులుగా మన నియంత్రణలో వుంచుకోవాల్సిన అవసరం కూడా వుందని ప్రధాని వ్యాఖ్యానించారు. 8నుంచి 15ఏండ్ల లోపు పిల్లల్లో 86శాతం మంది సోషల్‌ మీడియాను ఉపయోగించారని నిషేధానికి ముందు అధ్యయనంలో వెల్లడైనట్టు ప్రభుత్వం తెలిపింది. ఆస్ట్రేలియా నమూనాను తాము కూడా అనుసరించాలని, అందుకోసం అధ్యయనం చేయాలని యూరోపియన్‌ దేశాలతో సహా పలు దేశాలు భావిస్తున్నాయి. అయితే, వినూత్న ఆవిష్కరణలను, భావ ప్రకటనా స్వేచ్ఛను గొంతు నులిమివేయకుండా ఈ విధానాన్ని ప్రభుత్వాలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలవో చూడాల్సివుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -