ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కుర్ర రాకేష్, మంద అనిల్ కుమార్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్ర రాకేష్ మంద అనిల్ కుమార్ లు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి పునస్కరించుకొని సహస్ర జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కుర్ర రాకేష్, మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ మహిళా విద్యావేత్తగా సావిత్రిబాయి పూలే తన పేరును చరిత్రలో లిఖించుకున్నారనీ బాలికలకు నిమ్మ కులాల పిల్లలకు విద్యను నిషేధించే సామాజిక నిబంధనలు ఉన్న సమయంలో ఆమె పూణేలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించింది.
తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి ఆమె ఈ అణిచివేత సాంప్రదాయలను ధైర్యంగా సవాలు చేసిందనీ అన్నారు. స్త్రీ జాతి ఆణిముత్యం కరుడుగట్టిన బ్రాహ్మణిజం కబంధహాస్తాల నుంచి స్త్రీ జాతి విముక్తి కల్పించిన మహా సంకల్పి మాతృమూర్తి అని వారు వివరించారు. అవమానాలను ధిక్కరించి అనుగారిన ఆడపిల్లలకు అక్షరాలు నేర్పించిన భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక ఉద్యమకారిణి నిమ్మ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త, రచయిత్రి, స్త్రీలు విద్య అభివృద్ధికి, కృషిచేసిన,ధారాదీపం, విద్య క్రాంతి రేఖ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి బ్రాహ్మణీయ కులతత్వ సాంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్ వేముల అక్షయ,కో కన్వీనర్ శ్రీహరిక మరియు జిల్లా ఉపాధ్యక్షులు పెండెల ఆదిత్య ,జిల్లా సమితి నాయకులు మంద నిఖిల్, రాణి,శ్రీజ, అశ్విత, లాస్మిన్,శ్రీవాణి,నిఖిత మరియు సహస్ర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.



