సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు….లింగమల్ల జ్యోతి-శంకరయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
కాళేశ్వరం జోనల్ పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచులు గా,ఉప సర్పంచ్ లుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారత రాజ్యాంగ ఫలితంగా,ప్రజలే పాలకులు , గ్రామ ప్రజల చేత ,గ్రామాల అభివృద్ధికి ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అనే ఆయుధం ద్వారా ఎన్నికైన పాలకులు సమాజ నిర్మాణం, గ్రామాల అభివృద్ధికి ముడిపడి ఉందన్నారు.రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ది కోసం అందరూ నిస్వార్థంగా కృషి చేయాలని కోరారు.ఓటమి పాలైన అభ్యర్థులు నిరాశ పడకుండా ఓటమిని గునపాటంగా తీసుకుని, నిరాశ పడకుండా,పాజిటివ్ మోటో గా తీసుకుని,అందరు కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,కార్యదర్శి బండి సుధాకర్ పాల్గొన్నారు.
నూతన సర్పంచ్ లకు సొసైటీ శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



