- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి దీపాల వెలిగింపు కార్యక్రమాన్ని బుధవారం ప్రజలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్థానిక ఉంటున్న శివాలయాలకు వెళ్లి దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. సాయంత్రం వేళ ప్రతి కుటుంబము తమ ముంగిళ్ళలో దీపాలను ఉంచి నైవేద్యాలను ప్రజలకు పంపిణీ చేశారు. నెయ్యి దీపం నువ్వుల నూనె దీపం ఆవనూనె దీపం ఇప్పనూనె దీపం అంటూ ఆచార్యులు చెప్పిన విధంగా రకరకాల నూనెలతో దీపాలను వెలిగించడం వల్ల ఆయురారోగ్యము ధన ప్రాప్తి సుపుత్ర ప్రాప్తి జరుగుతుంది అని నమ్ముతూ కార్తీక పౌర్ణమి ఘనంగా నిర్వహించుకున్నారు.
- Advertisement -



