న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలతో కుదేలవుతున్న క్యూబాకు భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు ) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి సంఘీభావం తెలిపారు. బుదవారం నాడు ఇండియాలోని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం ఎకె గోపాలన్ భవన్‌లో ఎం.ఎ బేబీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు . బేబీ రాసిన తాజా పుస్తకం ద్వారా వచ్చిన రాయల్టీ 1లక్ష రూపాయలను క్యూబా సంఘీభావ నిధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ భారత ప్రజలు ఎల్లప్పుడూ క్యూబా ప్రజలకు అండగా నిలుస్తారని తెలిపారు. కొద్దిసేపు ఇరువురు రెండు దేశాల రాజకీయ అంశాలను చర్చించుకున్నారు. దీనిలో పోలిట్ భ్యూరో సభ్యులు, అంతర్జాతీయ విభాగాధిపతి ఆర్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు..



