- Advertisement -
– నవీన్ మిట్టల్‌కు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీఎన్జీవో కాలనీలో విద్యుత్ మీటర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం కోరింది. ఈ మేరకు బుధవారం టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి సొసైటీ కార్యదర్శి ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు, సొసైటీ మెంబర్ కస్తూరి వెంకట్ తదితరులు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యుత్ మీటర్ల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని మిట్టల్ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు నవీన్ మిట్టల్‌కు టీఎన్జీవో డైరీని అందజేశారు.
- Advertisement -



