Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మా భూ సమస్యలను పరిష్కరించండి

మా భూ సమస్యలను పరిష్కరించండి

- Advertisement -

మాతూ సంఘం గ్రామ దళితుల ఆవేదన
నవతెలంగాణ – కామారెడ్డి 

మా యొక్క ప్రభుత్వ భూమి సమస్యలు పరిష్కరించాలని మాతు సంఘం దళితు లు శుక్రవారం కామారెడ్డి సబ్ కలెక్టర్ ( రెవిన్యూ) విక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి సర్వేలు చేస్తున్న అధికారులు, మేము సాగు చేస్తున్నటువంటి భూమిని సర్వే చేయకుండా అక్కడ మేము సాగు చేసుకుంటున్నా ఉన్న భూస్వాములు అడ్డుకుంటున్నారనీ,  వారికి తాసిల్దారు సర్వేయర్లు వత్తాసు పలుకుతున్నారని, 175 సర్వే నెంబర్లు ఉన్నటువంటి వాళ్ల భూములు గురించి 119 సర్వే నంబర్లు సర్వే చేయడం సరైనది కాదని అన్నారు.

దళితులంతా 119 లోనే సాగు చేసుకుంటుండగా అక్కడున్న పెత్తందారులు ఆ భూములనుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది అన్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి భూమిని సర్వే చేసి మాకు పట్టా చేసి ఇవ్వాసమస్యలు కలెక్టర్ ని కోరడం జరిగిందన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ విక్టర్   మాట్లాడుతూ మీ సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తానని వెంటనే ఆర్డిఓ కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో దళితులు సంతోష వ్యాప్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మోతి రామ్ నాయక్ తో పాటు రామెల్ల రాములు, దేవి సింగ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -