మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మంగళవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. గురుకులాల టైంటేబుల్‌ను మార్చాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 437 మంది పండితులు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. సీఆర్టీలకు కనీస వేతనం వర్తింపజేయాలని తెలిపారు. పదోన్నతులు కల్పించాలని కోరారు.
వారంలో గురుకులాల సమయపాలన మార్పు ఉత్తర్వులు : మంత్రి హామీ
గురుకులాల సమయపాలన మార్పునకు సంబంధించి వారంరోజుల్లో ఉత్తర్వులను విడుదల చేస్తామంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో ఫోన్‌లో సంప్రదించి వారం రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. ఇతర సమస్యలపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. గురుకులాల్లోని అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో బాధ్యులు దిలీప్‌రెడ్డి, నర్సయ్య, ప్రభాకర్, భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల సమస్యలను పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES