- Advertisement -
– రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును కలిసిన మెకానిక్ అసోసియేషన్ సభ్యులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని మెకానిక్ అసోసియేషన్ సభ్యులు కామారెడ్డికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరినట్టు వారు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని మెకానిక్ అసోసియేషన్ సభ్యులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించవలసిందిగా కోరారు. ఆయన వెంటనే వారి సమస్యలపై కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు మెకానిక్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
- Advertisement -