- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజా బాట కార్యక్రమాలు చేపడుతున్నట్లు మద్నూర్ ట్రాన్స్కో ఏఈ గోపికృష్ణ తెలిపారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామంలో చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో విద్యుత్ సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ ప్రజా బాట కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దిగంబర్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామ కార్యదర్శి గ్రామస్తులు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



