నవతెలంగాణ – కామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో కేకులు కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పునాధులలో ఒకటిగా నిలిచిన యుపీఏ మాజీ చైర్మన్ సోనియా గాంధీ జన్మదినాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఉదయం పార్టీ జెండావందనంతో కార్యక్రమన్ని ప్రారంభించి, అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదినాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆమె దేశ రాజకీయాల్లో చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ సోనియా గాంధీ నాయకత్వం దేశాన్ని ప్రజాస్వామ్య విలువల దిశగా నడిపించిందన్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె అడుగుజాడల్లో నడవాలని యువకులకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐరనీ సందీప్ కుమార్, గుడుగుల శ్రీనివాస్, గోనే శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఉరదండ నరేష్ , చాట్ల రాజేశ్వర్, కన్నయ్య, పుట్నాల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, అజ్మత్, అతిక్, శివ కృష్ణమూర్తి, అన్వర్, ఎజాజ్, సత్యం, రాజు, సుదర్శన్, సల్మాన్, భూమనీ బాలరాజ్ , లక్క పతిని గంగాధర్, నమ సిరాజ్, గంప ప్రసాద్ , షేరు, అంజద్ , లడ్డు, కిరణ్, శిరీష్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక యువకులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



