– సీఎం రేవంత్‌రెడ్డి
– వర్చువల్‌గా కలెక్టరేట్లలో తెలంగాణతల్లి విగ్రహాల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న ప్రతి యేటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి ఆయన వివిధ జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన డిసెంబర్ 9 అనేది తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని నిలెబట్టిన రోజని తెలిపారు. అందుకే ఆ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. గతేడాది ఇదే రోజున సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని గుర్తుచేశారు.
తెలంగాణ ఇచ్చి… మాట నిలబెట్టుకున్న సోనియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



