Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సోనియా సందేశం

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సోనియా సందేశం

- Advertisement -

రేవంత్‌రెడ్డికి అభినందనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

2047 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల ఎనిమిది, తొమ్మిదో తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనుండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని సోనియా ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి ఈ సమ్మిట్‌ ఒక వేదికను అందిస్తుందని గుర్తుచేశారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ-వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతున్నదని సోనియాగాంధీ ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి సమ్మిట్‌ మరింత తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు సమ్మిట్‌లో పాల్గొనే వారందరికీ సోనియా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -