అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
నవతెలంగాణ-మర్పల్లి, బంట్వారం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇవ్వనుందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా మర్పల్లి, బంట్వారం మండలాల్లో ఆయన పర్యటించారు. కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. బంట్వారం మండలంలో 744 కార్డులు, మర్పల్లి మండలంలో 75 కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో పేదలకు ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. దాంతో అర్హులు సంక్షేమ పథకాలు కోల్పోయారని చెప్పారు. ప్రజల దరఖాస్తులను నాటి ఎమ్మెల్యేలు, మంత్రులు చెత్తబుట్టలో వేశారని విమర్శించారు. రేషన్‌కార్డులు మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతోపాటు అన్ని గ్రామాల్లోనూ రోడ్ల పనులు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ పాల్గొన్నారు.
ఇల్లు కోసం స్పీకర్ ఎదుట మహిళ మొర
తనకు స్థలం లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇంటి స్థలం కేటాయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బంట్వారం మండలానికి చెందిన ఓ మహిళ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. బాధిత మహిళకు స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.
త్వరలోనే మహిళలకు రూ.2,500
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES