- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
ఆత్మబంధు కార్యక్రమం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పండన్నకు చిరకాల స్వప్నం. మానవసేవే మాధవసేవ’ అని నమ్మే వ్యక్తుల్లో బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ పాండు రంగారెడ్డి ముందుంటారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే అలాంటి సమయంలో సదరు కుటుంబాలకు అండగా ఉండాలనే సంకల్పంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాండన్న ‘ఆత్మ బంధు’కి శ్రీకారం చుట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు భోజన సదుపాయాలు కల్పించడమే దీని ఉద్దేశ్యం. మంగళవారంమారపాక, జాలుతండా, రాజవరం గ్రామాల్లో ‘ఆత్మ బంధు’ కింద భోజన సదుపాయాలు కల్పించిచారు.
- Advertisement -