- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాక్ నిర్వహణ, భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 12, 2026 వరకు సుమారు 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి నడిచే MEMU, DEMU లోకల్ రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. ప్రయాణికులు ప్రయాణానికి ముందు రైల్వే ఎంక్వయిరీ లేదా NTES యాప్ ద్వారా రైళ్ల స్థితిగతులను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -



