Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తనిఖీ

పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
దక్షిణ మధ్య రైల్వే మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ శుక్రవారం సికింద్రాబాద్‌ డివిజన్‌లోని భద్రాచలం స్టేషన్‌తో సహా భద్రాచలం రోడ్డు – విష్ణుపురం సెక్షన్‌లో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఆయనతో పాటు సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణన్‌, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. అమత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం (ఏబీఎస్‌ఎస్‌)లో భాగంగా భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో రూ. 25.41 కోట్ల వ్యయంతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను జీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో 12 మీటర్ల ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జి, ప్లాట్‌ఫామ్‌ ఉపరితల పనులు, అదనపు కవర్‌ ఓవర్‌ ప్లాట్‌ఫామ్‌, లిఫ్ట్‌ల ఏర్పాటు, వెయిటింగ్‌ హాల్‌, సర్క్యులేటింగ్‌ ఏరియా పనులు తిలకించారు. స్థానిక అధికారులు జనరల్‌ మేనేజర్‌కు ప్రయాణికుల సౌకర్యాల గురించి వివరించారు.

ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను జీఎం ఆదేశించారు. జనరల్‌ మేనేజర్‌ భద్రాచలం రోడ్డులోని క్రూ లాబీని తనిఖీ చేసి, లోకో పైలట్‌, ట్రైన్‌ మేనేజర్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సమీక్షించారు. అనంతరం సిబ్బందితో కూడా ఆయన మాట్లాడి రోజువారీ పనిలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికుల సౌకర్యాలను జనరల్‌ మేనేజర్‌ పరిశీలించారు. స్టేషన్‌లోని వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రోడక్ట్‌ (ఓ.ఎస్‌.ఓ.పి) స్టాల్‌ను కూడా ఆయన సందర్శించారు. జనరల్‌ మేనేజర్‌ను అనేక మంది ప్రజాప్రతినిధులు కలిసి తమ విజ్ఞప్తులను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -