Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రత్యేక గుర్తింపు సాధించిన సదరన్‌ ట్రావెల్స్‌

ప్రత్యేక గుర్తింపు సాధించిన సదరన్‌ ట్రావెల్స్‌

- Advertisement -

నవతెలంగాణ-బంజారాహిల్స్‌ : సదరన్‌ ట్రావెల్స్‌ 50 ఏండ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రవాణా, పర్యాటక రంగాల్లో ప్రయాణికు లకు మరింత విశ్వాసం కల్పించేలా కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్‌ లక్డికాపూల్‌లో సదరన్‌ ట్రావెల్స్‌ కొత్త ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని శనివారం మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అందులో భాగంగా టూరిజం పాలసీని రూపొందిం చినట్టు తెలిపారు. రెవెన్యూ పెంపుతోపాటు పర్యాటకులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సదరన్‌ ట్రావెల్స్‌ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తోందన్నారు. నిర్వాహకులు సేఫ్టీ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సదరన్‌ ట్రావెల్స్‌ హైదరాబాద్‌ కేంద్రంగా విస్తరిస్తోందని తెలిపారు. నగరంలో హాస్పిటాలిటీ హౌటల్‌ను ప్రారంభించనున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి కంటే ముందే తెలంగాణలో హౌటల్‌ నిర్మించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ట్రావెల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణమోహన్‌ ఆలపాటి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా తమకు 18 శాఖలు ఉన్నాయని, 50 ఏండ్ల అనుభవంతో విభిన్న హాలిడే ప్యాకేజీలపై భారీ తగ్గింపులు అందిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad