Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో అమ్రాబాద్ మండలం పరిధిలో గల మున్ననూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ (ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్‌పోస్ట్) ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తనిఖీ చేశారు. అనంతరం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు,మద్యం,  ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, ప్రతీ వాహనం  వ్యక్తిని తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు వంటి వాటి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగించాలని, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -