Friday, October 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవలసదారుల గోడుపై గళం విప్పండి

వలసదారుల గోడుపై గళం విప్పండి

- Advertisement -

అమెరికా బిషప్‌లకు పోప్‌ లియో సూచన

వాటికన్‌ సిటీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అవలంబిస్తున్న కఠిన విధానాలు వలసదా రులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో పరిశీలించాలని పోప్‌ లియో బుధవారం బిషప్‌లకు సూచిం చారు. అమెరికాకు చెందిన కొందరు బిషప్‌లు వాటికన్‌ సిటీలో పోప్‌ను కలిశారు. పోప్‌ లియో కూడా అమెరికాకు చెందిన వారే. ట్రంప్‌ ప్రభుత్వం తమను దేశం నుంచి బలవంతంగా పంపేస్తుందేమోనని భయంగా ఉన్నదంటూ పలువురు వలసదారులు రాసిన లేఖలను బిషప్‌లు ఈ సందర్భంగా పోప్‌కు అందజేశారు. పోప్‌తో జరిగిన సమావేశానికి బిషప్‌లతో పాటు అమెరికా-మెక్సికో సరిహద్దుల నుంచి వచ్చిన సామాజిక కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అమెరికాలో నివసించేందుకు చట్టపరమైన అనుమతిలేని ఓ కుటుంబం తమను బలవంతంగా పంపేస్తారేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తూ పోప్‌కు లేఖ రాసింది. ‘మాపై జరుగుతున్న ఈ దాడులకు వ్యతిరేకం గా పోప్‌ బహిరంగంగా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము.

మా పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఆ కుటుంబం స్పానిష్‌ భాషలో లేఖ రాసింది. పోప్‌ లియోతో జరిగిన సమావేశం అనంతరం ఎల్‌ పాసో బిషప్‌ మార్క్‌ సైజ్‌ మాట్లాడుతూ వలసదారులకు సంబంధించిన అంశాలపై బిషప్‌ ఎంతో ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఈ విషయంపై అమెరికా బిషప్‌ల సమావేశం గట్టిగా మాట్లాడాలని సూచించారని తెలిపారు. బిషప్‌లు గళం విప్పాలన్నది పోప్‌ కోరిక అని, దానిని నెరవేరుస్తామని అన్నారు. కాగా పోప్‌ సమావేశంపై వాటికన్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఫ్రాన్సిస్‌ మరణానంతరం పోప్‌గా మేలో లియో ఎన్నికయ్యారు. ఫ్రాన్సిస్‌ పోప్‌గా ఉన్నప్పుడు తరచుగా ట్రంప్‌ ప్రభుత్వంపై విమర్శలు సంధించేవారు. పలు వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారు. అయితే పోప్‌ లియో మాత్రం ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించారు. ఇటీవలి కాలంలో ఆయన కూడా విమర్శలు మొదలు పెట్టారు. ట్రంప్‌ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్‌ విధానాలు కాథలిక్‌ చర్చి బోధనలకు (గర్భస్రావానికి అనుకూలంగా ఉండడం, పుట్టిన-పుట్టని మానవులందరికీ జీవించే హక్కు ఉన్నదని నమ్మడం) అనుగుణంగా ఉన్నాయా అని పోప్‌ లియో గత నెల 30న ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -