Wednesday, December 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌

ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సంచలన తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్‌ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -