నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జాతీయ జెండాను ఎగురువేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Home అసెంబ్లీలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్