Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి ..

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి ..

- Advertisement -

తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి 
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మండల కేంద్రంలో ఏటూరు నాగారం, తాడ్వాయి, పస్రా 163 వ జాతీయ రహదారిపై ములుగు జిల్లా ఎస్పీ శబరి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం పస్రా టూ తాడ్వాయి జాతీయ రహదారి కొండపర్తి మూలమలుపులు వద్ద ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రదేశాల వద్ద రిఫ్లెక్టింగ్ స్టిక్కర్స్ గల హెచ్చరిక ఫ్లెక్సీలను (హెచ్చరిక బోర్డులు), స్టేడియం స్టిక్కర్లు, వార్నింగ్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నట్లు, దీంతోపాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట తాడ్వాయి స్టేషన్ స్థానిక పోలీసులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad