నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఎంపీడీఓ ఉమాదేవీ, మండల విద్యాధికారి తరి రాముతో కలిసి అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో సుమారు నలభై నిమిషాల పాటు క కలియ తిరుగుతూ అన్ని వివరాలను టీచర్స్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చేస్తున్న బోధనా తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.
అదే విధంగా ప్రారంభోత్సవానకి సిద్ధంగావున్న కస్తూరి భా గాంధీ విద్యార్థుల అకాడమిక్ నూతన బ్లాక్ ను సందర్శించి సంతోషంవక్తం చేశారు. రికార్డులను పరిశీలించి విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం భవిత సెంటర్ ను విద్యార్థులతో సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.