- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో సిఎస్ఐ చర్చిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గాదరి గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి , సంఘ పెద్దలు శాలువతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చర్చి మౌలిక సదుపాయాల కోసం తన వంతుగా లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో చర్చి అభివృద్ధి కొరకు నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సంఘ పెద్దలు,కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



