- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండల గూడ్స్ వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రోజున రోడ్డు మైసమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన దారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చల్లగా చూడాలని మైసమ్మ ను పూజించారు. అనంతరం యూనియన్ సభ్యులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల గూడ్స్ వాహన యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
- Advertisement -