Thursday, January 22, 2026
E-PAPER
Homeనల్లగొండస్వర్ణ గిరి లో మంత్రి వర్గం ప్రభాకర్ ప్రత్యేక పూజలు

స్వర్ణ గిరి లో మంత్రి వర్గం ప్రభాకర్ ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాలను పురస్కరించుకొని తెలంగాణ శాసనసభ్యుడు బిసి సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జ్ బిజెపి  మాజీ పార్లమెంటు సభ్యుడు కోవా లక్ష్మణ్   కుటుంబ సమేతంగా  వేరువేరుగాగురువారం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారిని  కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ వ్యవస్థాపకులు  మానేపల్లి రామారావు, మురళి కృష్ణ గారు ఆలయ అర్చకులు ప్రత్యేకంగా స్వాగతం పలికి ఆలయంలోకి స్వాగతించారు.  దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని జల నారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ వ్యవస్థాపకులు  దంపతులకు లడ్డు ప్రసాదం,  మీ వారి చిత్రపటాలను అందజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -