నవతెలంగాణ – జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆషాడ మాసం పెద్దపోచమ్మ దేవతలకు గంగనీళ్ళు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాడ మాసం ముగింపు దశలో అదే విధంగా వర్షాలు పుష్కలంగా కురిసిన చెరువులు నిండిన సందర్బంగా గ్రామ ఆనవాయితో భాగంగా పెద్ద పోచమ్మ గంగనీళ్ళతో పాటు బోనాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ వీడిసి చైర్మన్ భాస్కర్, నారాయణ ,వెంపల్లి శ్రీనివాస్ గౌడ్, సహేందర్, సుధాకర్ తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మకూరు గంగు బాలయ్య మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు ఢికొండ శ్రీనివాస్ గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు అజయ్ , గ్రామ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు…
దేవతలకు గోదావరి జలాలతో ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -