Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు..

అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు..

- Advertisement -

ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం..
చండూరు మండలం నుండి ఐదుగురు ఉపాధ్యాయులకు సన్మానం
గట్టుప్పల్ మండలం నుండి ఇద్దరు  ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ  – చండూరు 

అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం నల్లగొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సేవా గుణం, అంకిత భావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఆయనసూచించారు. రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతం లో 75 శాతం పేద బడుగు బలహీన వర్గాలకు ప్రజల కోసం అందించేవారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.( హెల్ప్ ఏజ్ ఇండియా) సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియాలో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని, భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, విద్యా విధానం గొప్పదని తన రచనలో ఆయన వివరించారని ఆయన పేర్కొన్నారు.

రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారని, ఆయన సేవాగుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఎప్పటికీ నిలిచిపోయేలా చేశాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని ఆయన తెలిపారు. చండూరు మండల విద్యాధికారి వి. సుధాకర్ రెడ్డి, గట్టుప్పల మండల విద్యాధికారి  అమృతా దేవి  లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు సహజమని, ఎక్కడ ఉన్నా కూడా పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని  అన్నారు.

చండూరు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు…
చండూరు మండలం నుండి ప్రాథమిక పాఠశాలల నుండి ముగ్గురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల నుండి ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడం జరిగిందని వారు తెలిపారు.  ధోని పాముల  నుండి ఝాన్సీ,  బోడంగిపర్తి నుండి నాగమణి, కొండాపురం నుండి భద్రయ్య, జడ్పీహెచ్ఎస్ చండూరు నుండి జీవి. వెంకటేశ్వర్, జడ్పీహెచ్ఎస్ పుల్లెంల నుండి ధర్మారావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా, గట్టుప్పల మండలంలోని తెరాట్పల్లి  నుండి  సిహెచ్.కేశవ్, అంతపేట జడ్పీహెచ్ఎస్ నుండి  శ్రీనివాసచార్యులు, ఎన్నిక కావడం జరిగిందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు, గట్టుప్పల మండల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad