Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదీపావళికి ప్రత్యేక రైళ్లు..

దీపావళికి ప్రత్యేక రైళ్లు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్:  దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగకు స్వస్థలాలకు వెళ్లే వారి సౌకర్యార్థం గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి – సికింద్రాబాద్ స్పెషల్ (07497) రైలు నేటి రాత్రి 7:40 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. ఈ రైలు అర్ధరాత్రి 1:30 గంటలకు తెనాలి, 2:20 గంటలకు గుంటూరు, 3:00 గంటలకు సత్తెనపల్లి, తెల్లవారుజామున 4:00 గంటలకు నడికుడికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని వివరించారు.

అదేవిధంగా, విజయవాడ – సికింద్రాబాద్ స్పెషల్ (07213) రైలు నేడు,రేపు ఉదయం 6:25 గంటలకు విజయవాడలో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇది ఉదయం 7:03 గంటలకు మంగళగిరి, 7:30 గంటలకు గుంటూరు, 8:18 గంటలకు సత్తెనపల్లి, 8:48 గంటలకు పిడుగురాళ్ల, 9:18 గంటలకు నడికుడి మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 1:00 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ – విజయవాడ స్పెషల్ (07214) రైలు అక్టోబర్ 17, 18 తేదీల్లో సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 7:28 గంటలకు సత్తెనపల్లి, 8:25 గంటలకు గుంటూరు, 8:58 గంటలకు తెనాలికి చేరుకుని, రాత్రి 9:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -