- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏపీలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
- Advertisement -



