ఏ. యం. వి. ఐ లు రోహిత్ రెడ్డి,సాగర్
నవతెలంగాణ – బాల్కొండ
వాహనాలను అతివేగంగా నడపడం వల్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుందని ఏ.యం.వి.ఐ లు రోహిత్ రెడ్డి సాగర్ తెలిపారు. మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శనివారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు అతివేగంగా రోడ్డు పై వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ అసిస్టెంట్ మోటార్ వెకీల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి,సాగర్ లు సూచించారు.
రోడ్డు పై బైక్, కార్లు ఏదైనా వాహనాలు నడుపాలన్న 18 వయస్సు పైబడి ఉన్నవారే నడపాలని,మైనర్ గా ఉండి వాహనాలను నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకూటమని వారు హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్డు పై హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూన్న వారికి,విద్యార్థులు వారి తల్లి దండ్రులకు హెల్మెట్ ధరించే వాహనాలను నడపాలని సూదించాలని వారు తెలిపారు.అనంతరం పాఠశాలలో మైదానంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.విద్యార్థులు శివాజీ చౌక్ నుంచి పాతబస్తాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విగ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపాల్ విజయకర్తన్, కానిస్టేబుల్ మనోజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.



