Sunday, November 16, 2025
E-PAPER
Homeఆటలుస్పిన్‌కు విలవిల

స్పిన్‌కు విలవిల

- Advertisement -

రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ మాయాజాలం
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 93/7
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 189/10

పరుగుల పిచ్‌ అంటూ ఊరించిన ఈడెన్‌గార్డెన్స్‌.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. తొలి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్‌ మాయ మొదలైంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌట్‌ కాగా.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోర్ల టెస్టు మూడు రోజుల్లోనే ముగిసే అవకాశం ఉంది.

నవతెలంగాణ-కోల్‌కతా
లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (4/29), చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (2/12) మాయాజాలం సృష్టించారు. మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (1/30) సైతం మాయలో జతకలవటంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 93/7తో కష్టాల్లో పడింది. కెప్టెన్‌ తెంబ బవుమా (29 నాటౌట్‌, 78 బంతుల్లో 3 ఫోర్లు), కార్బిన్‌ బాచ్‌ (1 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులే చేసింది. ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (39, 119 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రిషబ్‌ పంత్‌ (27, 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (27, 45 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్‌ కాగా.. భారత్‌ 30 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది.

సఫారీ విలవిల
స్పిన్‌ త్రయం జడేజా, కుల్‌దీప్‌, అక్షర్‌ మాయ ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్లు విలవిల్లాడారు. ఓపెనర్‌ రికెల్టన్‌ (11) వికెట్‌తో కుల్‌దీప్‌ వికెట్ల జాతరకు తెరతీయగా.. జడేజా సఫారీ పతనం వేగవంతం చేశౄడు. మార్‌క్రామ్‌ (4)ను అవుట్‌ చేసిన జడేజా.. వియాన్‌ ముల్డర్‌ (11), టోనీ (2)లను ఒకే ఓవర్లో సాగనంపాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5) సైతం జడేజా మాయలో పడ్డాడు. మార్కో జాన్సెన్‌ (13)ను కుల్‌దీప్‌.. కైల్‌ వెరెనె (9) అక్షర్‌ అవుట్‌ చేయటంతో దక్షిణాఫ్రికా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌ లోటు అనంతరం సఫారీ ప్రస్తుతం 63 పరుగుల ముందంజలో నిలిచింది. కెప్టెన్‌ తెంబ బవుమా (29 నాటౌట్‌) ఓ ఎండ్‌లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. నేడు ఉదయం సెషన్లో ఆ జట్టు 50-60 పరుగులు జోడించటంపై కన్నేసింది.

మనోళ్లూ పడ్డారు
ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌పై భారత బ్యాటర్లు సైతం తడబాటుకు గురయ్యారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (4) మెడ నొప్పితో రిటైర్డ్‌ హర్ట్‌గా నిష్క్రమించి, మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (39) నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరువగా.. వాషింగ్టన్‌ సుందర్‌ (29) నం.3 బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు. రిషబ్‌ పంత్‌ (27) రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో ధనాధన్‌ దూకుడు చూపించగా.. రవీంద్ర జడేజా (27) రాణించాడు. ధ్రువ్‌ జురెల్‌ (14), అక్షర్‌ పటేల్‌ (16) ఫర్వాలేదనిపించారు. టెయిలెండర్లు కుల్‌దీప్‌ (1), సిరాజ్‌ (1), బుమ్రా (1 నాటౌట్‌) పరుగుల వేటలో మెప్పించలేదు. 62.2 ఓవర్లలో భారత్‌ 189 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల విలువైన ఆధిక్యం దక్కించుకుంది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 159/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (బి) జాన్సెన్‌ 12, కెఎల్‌ రాహుల్‌ (సి) మార్‌క్రామ్‌ (బి) మహరాజ్‌ 39, వాషింగ్టన్‌ సుందర్‌ (సి) మార్‌క్రామ్‌ (బి) హార్మర్‌ 29, శుభ్‌మన్‌ గిల్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 4, రిషబ్‌ పంత్‌ (సి) వెరెనె (బి) బాచ్‌ 27, రవీంద్ర జడేజా (ఎల్బీ) హార్మర్‌ 27, ధ్రువ్‌ జురెల్‌ (సి,బి) హార్మర్‌ 4, అక్షర్‌ పటేల్‌ (సి) జాన్సెన్‌ (బి) హార్మర్‌ 16, కుల్‌దీప్‌ యాదవ్‌ (సి) వెరెనె (బి) జాన్సెన్‌ 1, సిరాజ్‌ (బి) జాన్సెన్‌ 1, బుమ్రా నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం : (62.2 ఓవర్లలో ఆలౌట్‌) 189.
వికెట్ల పతనం : 1-18, 2-75, 2-79 (గిల్‌), 3-109, 4-132, 5-153, 6-171, 7-172, 8-187, 9-189.
బౌలింగ్‌ : మార్కో జాన్సెన్‌ 15-4-35-3, వియాన్‌ ముల్డర్‌ 5-1-15-0, కేశవ్‌ మహరాజ్‌ 16-1-66-1, కార్బిన్‌ బాచ్‌ 11-4-32-1, సైమన్‌ హార్మర్‌ 15.2-4-30-4.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ : రియాన్‌ రికెల్టన్‌ (ఎల్బీ) కుల్‌దీప్‌ 11, ఎడెన్‌ మార్‌క్రామ్‌ (సి) జురెల్‌ (బి) జడేజా 4, వియాన్‌ ముల్డర్‌ (సి) పంత్‌ (బి) జడేజా 1, తెంబ బవుమా నాటౌట్‌ 29, టోనీ (సి) జురెల్‌ (బి) జడేజా 2, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (బి) జడేజా 5, వెరెనె (బి) అక్షర్‌ 5, మార్కో జాన్సెన్‌ (సి) రాహుల్‌ (బి) కుల్‌దీప 13, కార్బిన్‌ బాచ్‌ నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93.
వికెట్ల పతనం : 1-19, 2-25, 3-38, 4-40, 5-60, 6-75, 7-91.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 6-1-14-0, అక్షర్‌ పటేల్‌ 11-0-30-1, కుల్‌దీప్‌ యాదవ్‌ 5-1-12-2, రవీంద్ర జడేజా 13-3-29-4.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -