Sunday, July 27, 2025
E-PAPER
Homeసినిమాసెప్టెంబర్‌లో 'స్పిరిట్‌' షూటింగ్‌..

సెప్టెంబర్‌లో ‘స్పిరిట్‌’ షూటింగ్‌..

- Advertisement -

ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఇందులో ప్రభాస్‌కు జోడిగా త్రిప్తి దిమ్రి కనిపించనుంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్‌’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకున్న త్రిప్తి తొలిసారి ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మెరవనుంది.
ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సెప్టెంబర్‌ చివరి నుండి ప్రారంభం కానుందని టీమ్‌ అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమా గ్లోబల్‌ మూవీగా రూపొందుతోంది.
దీన్ని తొమ్మిది భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ స్కేల్‌, యూనివర్సల్‌ అప్పీల్‌తో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అలరించ నుందని మేకర్స్‌ తెలిపారు. ప్రణరు రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌, టి-సిరీస్‌ ఫిల్మ్స్‌ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -