– ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
– ప్రతి గణపతి ఉత్సవ కమిటీలకు ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ – రాయపర్తి
నవరాత్రులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవంతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బంధనపల్లి, కొత్తూరు, పెర్కవేడు, సన్నూరు, బాలు నాయక్ తండా, జయరాం తండా, తదితర గ్రామాల్లోని గణపతి మండపాల ఉత్సవ కమిటీకలకు తల 2016ల ఆర్థిక విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక భావనతోనే శాంతియుత సమాజం ఏర్పడుతుందని తెలిపారు. వాడ వాడన గణపతి ప్రతిమలను ప్రతిష్టించి పూజలు చేయడంతో మనిషిలోని కల్మషం నశిస్తుందన్నారు. యువత సన్మార్గంలో నడవడానికి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతగానో దోహదపడుతున్నాయని కొనియాడారు.
నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూస్, టై, బెల్ట్, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తే విద్యలో రాణిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిక్షిప్తులైన ఉపాధ్యాయులు ఉంటారని వారి బోధనలతో విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తారని తెలిపారు. పాఠశాలలకు కావాల్సిన అవసరాలు కూడా తీరుస్తా అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్టీ సెల్ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ నాయక్, నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, గాదె రవీందర్ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, కోలా సంపత్, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, ఉబ్బని సింహాద్రి, చిలువేరు సాయి గౌడ్, ఉబ్బని మధు, గారే నరేష్, ఐత జంపి, పిరని రాజు తదితరులు పాల్గొన్నారు.